మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం30/03/2025 ఆదివారం) ఉగాది పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి కిష్టారం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వైజాగ్ నుండి ఖమ్మం వస్తున్న ఖమ్మం డిపో కి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పెనుబల్లి 108 సిబ్బంది టెక్నీషియన్ రామకృష్ణ, పైలెట్ రాధాకృష్ణ తక్షణమే స్పందించి క్షతగాత్రులను పెనుబల్లి, సత్తుపల్లి హాస్పిటల్స్ కు తరలించారు.
ఈ ప్రమాదంలో సత్తుపల్లి డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న కల్లూరు కు చెందిన వన్నపూరపు సీతారామ ప్రసాద్ మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సీతారాంప్రసాద్ హైదరాబాద్ డ్యూటీ ముగించుకొని సత్తుపల్లి నుండి ఇంటికి వెళుతూండగా జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.