మన టివి 6 న్యూస్ ( మన ప్రాంత వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం).
10 వ తేదీ సోమవారం ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా.సురేష్ నాయక్ ఆధ్వర్యంలో, మోఫి మానసిక వికలాంగుల సమక్షం లో మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ శ్రీ తుంబురు.దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మానసిక వికలాంగులతో కలిసి కేక్ కట్ చేసి,పండ్లు పంపిణీ చేశారు.అలాగే వారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ క్వింటా బియ్యం , నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులు తుంబురు.దయాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భూక్యా.సురేష్ నాయక్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు.ప్రద్యుమ్న చారి, ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ నాయుకురాళ్ళు రాయల.కృష్ణ వేణి, సమీరా, సుకన్య, ఎదులాపురం మున్సిపల్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
