మన టివి 6 న్యూస్ ( మన ప్రాంత వార్తలు మనకోసం 11/02/2015 మంగళవారం). పెనుబల్లి మండల పరిదిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముత్తగుడెం ,కుప్పెనకుంట్ల విద్యార్ధులకు రక్షిత్ ఫౌండేషన్ ఆధ్వ్యంలో ఫౌండర్ కోట జాన్ ఆధ్వర్యంలో తొమ్మిది, పదో తరగతి విద్యార్ధులకు కెరీర్ గైడెన్స్ పై మోటివేషనల్ స్పీకర్స్ కోట కిషోర్ బాబు,పంజి జైపాల్ విద్యార్థులకు పదవ తరగతి తరువాత వివిధ కోర్సులు,విద్య అవకాశాలు, పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవలంభించలిసిన పద్దతులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గొప్పతనం వంటి అంశాలు పై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు ,పెన్నులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయులు మోహనరావు మాట్లాడుతూ పదవ తరగతి తరువాత ఏమిటి అనే సందేహంతో ఉన్న ప్రతి విద్యార్థి కి ఒక దిశ నిర్దేశం చేసేలా విద్యార్ధులకు కోర్సులు గురించి తెలియచేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంది అని తెలిపినారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రక్షిత్ ఫౌండేషన్ వారిని అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఫౌండర్ కోట జాన్, ఫౌండేషన్ సభ్యులు కే కే రావు,రవికుమార్,ప్రశాంత్ కుమార్,మల్లిక్, ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
