మన టివి6 న్యూస్ – ఖమ్మం రూరల్ (లోకల్ న్యూస్ జులై 03/25). ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం ఎం.పి.రామ సహాయం రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించి, పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సం చేశారు.
ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నేకల్ గ్రామం నుంచి పొన్నేకల్ చెర్వు మీదుగా నర్సింహపురం వరకు బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, ఏదులాపురం మున్సిపాలిటీ లోని వరంగల్ క్రాస్ రోడ్డు దగ్గర ఆధునీకరించిన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు ప్రారంభోత్సవం, ఏదులాపురం ఎంపిడిఓ కార్యాలయంలో మున్నేరు వరద బాధితులకు ఇండ్ల పట్టాల పంపిణి, ఏదులాపురం నుంచి గొల్లగూడెం వరకు ఆదిత్యానగర్ లింక్ రోడ్డు మీదుగా పంచాయతీ రాజ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ధరావత్. రామ్మూర్తి నాయక్ తమ్మినేని నవీన్ , కాంగ్రెస్ మండల అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు.
