మన టివి6 న్యూస్- ఖమ్మం రూరల్ (లోకల్ న్యూస్ జూలై 2/25). ఘనంగా వనజీవి రామయ్య జయంతి వేడుకలు దరిపల్లి అనంతరాములు కాలేజీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వనజీవి రామయ్య జయంతికి గుర్తుగా దరిపల్లి అనంతరాములు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో, ప్రకృతి ప్రియుడు, వనాల రక్షకుడు వనజీవి దరిపల్లి రామయ్య జయంతిని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ డా. దరిపల్లి కిరణ్ స్వయంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా దరిపల్లి కిరణ్ వనజీవి రామయ్య జీవితం గురించి విద్యార్థులకు వివరిస్తూ, వనజీవి రామయ్య జీవితం, సేవా స్ఫూర్తి, పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయనకున్న పట్టుదల భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. వనజీవి రామయ్య తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, రెడ్డిపల్లి గ్రామానికి చెందినవారు. పర్యావరణ పరిరక్షణను తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్న రామయ్య లక్షలాది చెట్లను స్వయంగా నాటి, లక్షలాది విత్తనాలను ప్రజల్లో పంచారు. సైకిల్‌పై తిరుగుతూ గ్రామాల్లో మొక్కల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆయనకు 2017లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు లభించింది. విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటి, వనజీవి. రామయ్య ఆశయాలకు జీవం పోస్తున్నారు.
