మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 24/05/2025 శనివారం).తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం లో భాగంగా పెనుబల్లి మండలంలో సుమారు 600 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ పేద ప్రజలు 10 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి ఇంటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఈరోజు అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు సమాజంలోని కుల మత వర్గ విభేదాల లేకుండా అన్ని పార్టీల వారికి సమానంగా అందుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు వివరాలు వారి మాటల్లోనే చూద్దాం…