రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు. మరొకరికి స్వల్ప గాయాలు.మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 19/03/2025 బుధవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం బంజర్ రింగ్ సెంటర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనం బొలెరో వాహనం ఢీ కొన్న ప్రమాదంలో లంకపల్లి గ్రామానికి చెందిన గోదా రామాంజనరావుకి తీవ్ర గాయాలు కాగా అతని కుమార్తె నవీనకి స్వల్ప గాయాలు అయ్యాయి.
స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో వెంటనే అప్రమత్తమైన 108 సిబ్బంది టెక్నీషియన్ ప్రవీణ్, పైలెట్ రాధాకృష్ణ హుటాహటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన రామాంజనరావు, అతని కుమార్తె నవీనాను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్