మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 19/03/2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం బంజరలో లారీ డ్రైవర్ కు గుండెపోటు వచ్చిందని సమాచారం తెలుసుకుని పోలీసులు తక్షణమే అప్రమత్తమై ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి వైద్య అందించారు.
మొగుళ్ళ కృపారావు అనే లారీ డ్రైవర్ మంగళవారం రాత్రి గోకవరం నుండి మొక్కజొన్న లోడ్ తో వెళుతున్న క్రమంలో వి.ఎం బంజర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి విశ్రాంతి తీసుకున్నాడు.
బుధవారం ఉదయం 7 గంటల సమయంలో గుండెపోటు వస్తుందని రోడ్డుపై వెళ్తన్న రామకృష్ణ అనే వ్యక్తిని 108కు ఫోన్ చేయమని కోరడంతో రామకృష్ణ తన దగ్గర ఫోన్ లేకపోవడంతో తక్షణమే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై స్పెషల్ బ్రాంచ్ పుల్లారావు, హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య, కానిస్టేబుల్ వీరరాఘవులు పోలీస్ కార్లోనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించి కృపారావు ప్రాణాలు కాపాడారు.
