google-site-verification: google78487d974c7b676c.html
Local News

మహిళా సాధికారతే ధ్యేయంగా కాంగ్రెస్ పథకాలు…. భూక్య సురేష్ నాయక్.

26.6KViews

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 17/05/2025 శనివారం). మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ అన్నారు.గురుకులంలో చదివే విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గురుకుల వసతి గృహాలకు నిత్యావసరాలు, కాస్మెటిక్స్ సరఫరా మహిళా సంఘాల ద్వారా చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేసి పారదర్శక, ప్రజాస్వామ్య పాలన వైపు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని సురేష్ నాయక్ తెలియజేశారు.

➡️ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభం.

➡️ మహిళా సంఘాల ద్వారా 4,000మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు.

➡️ మహిళల పేరు మీద సుమారు 40లక్షల కొత్త రేషన్‌ కార్డుల మంజూరు.

➡️ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రోత్సాహకాలు.

➡️ మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టీసీ బస్సులు కొనుగోలు.

➡️ మహిళలకు మేలు జరిగేలా డ్వాక్రా గ్రూపుల్లో చేరే వయస్సు నిబంధనలను సడలించింది. 15 ఏళ్ల నుంచే చేరే అవకాశం కల్పించింది. గరిష్ట వయస్సును కూడా 65 ఏళ్లకు పెంచింది.

ఇలా మహిళల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. వాటిల్లో మహాలక్ష్మి పథకానికి మంచి స్పందన వచ్చింది. లక్షలాది మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లోనూ మహిళలకే పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే ఐకెపిలో మహిళ విఒల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైస్ మిల్లులు కూడా మహిళలకు కేటాయిస్తూ, అనేక రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మహిళ ప్రోత్సాహక పథకాల ఇస్తూ మహిళల సాధికారతకు రేవంతన్న ప్రభుత్వం అడుగులు వేస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్ తెలియజేశారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!