మన టీవీ సిక్స్ న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 31/01/2025 శుక్రవారం).తల్లాడ మండల కేంద్రంలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ అమాలీ కార్మికుల జనరల్ బాడీ యూనియన్ అధ్యక్షుడు కే వెంకటేశ్వరావు అధ్యక్షతన 31వ తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ…. కేంద్రంలో పాలన సాగిస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, మరోవైపు కార్పొరేటు మతోన్మాద శక్తులను అభివృద్ధి చేయటానికి దుర్మార్గమైనటువంటి చర్యలను మోడీ అనుసరిస్తున్నారని, కార్మిక వర్గంపై కక్షగట్టి 44 చట్టాలను 4 స్తంభాలుగా మార్చి కార్మికుల యొక్క రక్త మాంసాలు పీల్చే విధంగా చట్టాల మార్పు చేయటం ఎంతవరకు సమంజసం అని విఠల్రావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రోజుకు 12 గంటలు 18 గంటలు పనిచేయాలని చట్టాలలో మార్పులు తీసుకురాటం, పేద కార్మికుల యొక్క జీవనాన్ని విధానాన్ని ఇబ్బందులకు గురి చేయడమేనని ఆయన అన్నారు. కేంద్రం ప్రభుత్వం అనుసరించబోతున్న ఈ విధానాలను ఎదిరించి ఆపడానికి రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు సిద్ధమవ్వాలని విటల్ రావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిఐటియు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు పి రమ్య, సిఐటియు మండల కన్వీనర్ ఎస్కే మస్తాన్, సిఐటియు జిల్లా నాయకులు అయినాల రామలింగేశ్వర రావు, హమాలి యూనియన్ బాధ్యులు ఎస్కే జానీ, రమేష్, వెంకటేశ్వరరావు, కొండ శ్రీనివాసరావు, గుడిపల్లి కృష్ణయ్య, నల్గొండ కృష్ణ, ముఠా వెంకటకృష్ణ , పాలపు వెంకటేశ్వర్లు, కే,నవీను, గుడిపల్లి నరసింహారావు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
