బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కి సత్తుపల్లి నియోజకవర్గంలో ఘనంగా స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు..కేటీఆర్ రాకతో చీమలదండులాగా కదిలిన గులాబీ సైన్యం…బైక్ ర్యాలీలతో, గజమాలతో కేటీఆర్ కి ఘన స్వాగతం పలికిన సత్తుపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు .
సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో డిసీఎంఎస్ మాజీ చైర్మన్ స్వర్గీయ రాయల శేషగిరిరావు విగ్రహాన్ని సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లు కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు, భానోత్ హరిప్రియ, కొండ బాల కోటేశ్వరరావు, మదన్ లాల్, మెచ్చ నాగేశ్వరరావు, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మరియు జిల్లా ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

స్వర్గీయ రాయల శేషగిరిరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం మౌనం పాటించారు.తదనంతరం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ..ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో జన్మించిన స్వర్గీయ రాయల శేషగిరిరావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పై ఉన్న అభిమానం తో టీడీపీ లో పనిచేసిన ఆయన మొట్టమొదటి సారిగా 1987 లో ఎంపీపీ గా ఎన్నికయ్యారని,ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా 2006-2007 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడుగా చేశారని తెలిపారు.
