తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఆకర్షితుడై అప్పటి తెరాస లో చేరిన రాయల శేషగిరిరావు కి కేసీఆర్ ప్రభుత్వంలో 2014 లో డిసిసిబి డైరెక్టర్ గా పనిచేశారని, 2019 లో డీసీఎంఎస్ చైర్మన్ గా సేవలు అందించిన ఆయన అనారోగ్య కారణాల వలన 2024 మే 15 న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందటం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటు అని తెలిపారు …ఆయన చేసిన సేవలను కొనియాడారు..ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
♦️ కీ. శే రాయల శేషగిరిరావు విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు..
♦️ కేసీఆర్ ప్రజల కోసం సీతారామా ప్రాజెక్ట్ తెస్తే ఆ నీళ్ళు నెత్తిన జల్లుకునారు కానీ ప్రజలకు ఏమి చేయలేదు.
♦️ తప్పకుండా ఇచ్చిన హామీని 100 రోజుల్లో చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.
♦️ కేసీఆర్ కిట్ అనే పథకం అద్భుతమైన పథకం. కాంగ్రెస్ వచ్చాక ఆ పథకం ఎత్తేశారు.
♦️ రైతుబంధు గురించి ఆనాడు రెండు పంటలకు ఇస్తావా? అని అడిగిన రేవంత్ నేడు ఒక్క పంటకి కూడా ఇవ్వడం లేదు.
♦️ మార్పు బాగుందా? మార్పు కావాలని జిల్లా మొత్తం కాంగ్రెస్‌కి ఓటేశారు.
♦️ నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసా, ఎవరూ కూడా రేవంత్ రెడ్డి లాగ దివాళాకోరు మాటలు మాట్లాడలేదు.
♦️ ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారంటున్నా రేవంత్.. దొంగను దొంగలాగే చూస్తారు కదా ?.
♦️ ఢిల్లీలో అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. అపాయింట్‌మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకుపోతాడని అంటున్నారు.
♦️ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల్లో ఉండాలి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చాటాలి.
♦️ రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలి అని కోరారు. అనంతరం రాయల శేషగిరిరావు రావు గారి గారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.