మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/05/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గురవాయిగూడెం గ్రామంలో శిలా జీవద్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ తేదీ శుక్రవారం నుండి 11వ తేదీ ఆదివారం వరకు మూడు రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభోగంగా జరుగుచున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు.
మొదటిరోజు శుక్రవారం పూజ్య గురువులైన బ్రాహ్మణోత్తముల మొదటిరోజు మంగళ తోరణం గ్రామ తల తోరణం మొదలగు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రెండవ రోజు 10 తేదీ శనివారం మంగళ వాయిద్యం, పాత:కాల పూజలు, గోపూజ, వేద పారాయణం, సూర్య నమస్కారాలు, ఆరు శాపారాయణము, మూలమంత్ర జపము, అనుస్థానములు, అభిషేకము కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.
మూడవరోజు 11వ తేదీ ఆదివారం ఉదయం స్రతీ అశ్వా హవచనము, గోపూజ, విఘ్నేశ్వర పూజ, శ్రీ శీతల పరమేశ్వరి విగ్రహము, శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహము, శ్రీ పోతురాజు స్వామి గృహము, శ్రీ కోదండ రామస్వామి శిలా జీవద్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.