మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/05/2025 సోమవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని కొత్త కారాయిగూడానికి చెందినటువంటి నెల్లూరి బోధనా చారి ఇటీవల వి.ఎం బంజర్ గ్రామంలోని తిరువూరు రోడ్ నందు గల గెస్ట్ హౌస్ ఎదురుగా క్రింద పడిపోయి మరణించాడు. వడదెబ్బ కారణంగా బోదనా చారి మరణించి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పాతకారాయిగూడెం మమతా పబ్లిక్ స్కూల్ 2003-2004 సంవత్సరంలో బోధన చారితో కలిసి చదువుకున్న మిత్రులు అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని గమనించి 20వేల రూపాయలు ఆర్థిక సహాయంగా బోధనా చారి కుటుంబ సభ్యులకు అందించారు.

Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్