google-site-verification: google78487d974c7b676c.html
Daily News

ధాన్యం కొనుగోలులో ఐకెపి సిబ్బంది లీలలు.

60.4KViews

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/05/2025 సోమవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఐకెపి సిబ్బంది లీలలు అన్నీ ఇన్ని కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఐకెపి సిబ్బంది అనధికారికంగా రైతులతో క్వింటాకు 2 వేలు రూపాయలు మాట్లాడుకొని ధాన్యం కొనుగోలుకు చేసి, ప్రభుత్వం పంపించిన గన్ని బ్యాగులతో, ప్రభుత్వం పంపించిన లారీలలో లోడు ఎత్తి మిల్లులకు పంపిస్తూ సొంత వ్యాపారానికి తెర తీశారని కొందరు రైతులుఆరోపిస్తున్నారు.

దీనిపై ఐకెపి సిబ్బందిని, అధికారులను ఇప్పటి వరకు ధాన్యం కేంద్రానికి వచ్చినటువంటి దాన్యం వివరాలు, కాటాలు వేసి మిల్లులకు పంపించిన దాన్యం వివరాలు, గన్ని బ్యాగుల వివరాలు కోరగా ఇదిగో ఇస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప పూర్తి వివరాలు ఇవ్వకపోవడం శోచనీయం. దీనితో రైతులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐకెపి సెంటర్ కు వచ్చినటువంటి దాన్యం కాటాలు వేసి మిల్లులకు పంపించడంలో ఐకెపి సిబ్బంది ఎన్నో లీలలు ప్రదర్శిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పెనుబల్లి మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ వద్దకు సోమవారం పర్యవేక్షణకు వచ్చిన తాసిల్దార్ గంట ప్రతాప్ ముందు రైతులు తమ సమస్యలను ఇబ్బందులను వ్యక్తపరిచారు.

గతంలో సాల్వ పంట కొనుగోలు సమయంలో పెనుబల్లి మండల కేంద్రంలో ఐకెపి సెంటర్లో అవకతవకలు జరిగాయని రైతులు జాతీయ రహదారిపై ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. దీనికి వెంటనే స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ లారీలను పంపించి అధికారుల సమన్వయంతో సమస్యలు వెంటనే పరిష్కరించారు. ఐకెపి సిబ్బంది లీలలకు కడుపు మండిన ఓ రైతు వారి ఇంటి ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

గత పది సంవత్సరాలలో ధాన్యం కొనుగోలు సమయంలో ప్రతిసారి పెనుబల్లి మండల కేంద్రంలో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం అయిపోయింది.మండలంలో ఐకెపి సెంటర్ నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది ఉన్నతాధికారుల తెలియకుండా మిల్లుల యజమానులతో పరస్పర అవగాహన ఏర్పాటు చేసుకొని లోపాయి కార ఒప్పందాలు చేసుకొని రైతులను అనేక రకాలుగా నష్టపరుస్తున్నారని గత కొన్ని సంవత్సరాలుగా రైతుల ఆరోపిస్తున్నారు.

పెనుబల్లి ఐకెపి సెంటర్ పై ఉన్నతాధికారులతో పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని రైతుల కోరుతున్నారు. అయితే ఐకెపి సిబ్బందిని ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కొత్తవారిని ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్యలకు కొంతవరకు అరికట్టవచ్చునని రైతులు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!