మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/05/2025 మంగళవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో ఇండోస్ కార్పోరేట్ సంస్థ చేపట్టిన సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
సెల్ఫోన్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ తో మనిషి శరీరంలోని కణ అభివృద్ధి విధానంపై ప్రభావి చూపించి తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రేడియేషన్ ప్రభావంతో చర్మ, కళ్ళ సమస్యలు రావడం,వెంట్రుకలు ఉండిపోవడం,మగవారిలో పిల్లలు పుట్టే సామర్థ్యం పై ప్రభావం చూపడం ఇలా అనేక రకాలుగా ప్రజల జీవన విధానంపై ప్రభావతం చూపించే ఈ సెల్ఫోన్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని లేకపోతే లంకపల్లి గ్రామంలోని ప్రజలు క్యాన్సర్ పేషెంట్లగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సెల్ఫోన్ టవర్ విడుదల చేసే రేడియేషన్ వలన మనుషులకే కాకుండా, పశువుల, పక్షుల, కీటకాల పునరుత్తిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని, రైతులు పండించే పంటలలో కీరణ జన్య సంయోగ క్రియపై ప్రభావం పడడంతో పంట సామర్థ్యం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని లంకపల్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతి, పర్యావరణం, ప్రజలపై ప్రభావం చూపించే ఈ సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని లంకపల్లి గ్రామస్తులతో కలిసి సిపిఎం నాయకులు పెనుబల్లి తహసిల్దార్ గంటా ప్రతాప్ కు వినతి పత్రం అందజేశారు. తక్షణమే కాంట్రాక్టర్ తో మాట్లాడతామని, సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తామని, తాసిల్దార్ సిపిఎం నాయకులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, సిపిఎం మండల కమిటీ సభ్యుడు తడికమళ్ళ చిరంజీవి, సండే సత్యం,మరియు లంకపల్లి గ్రామ ప్రజానీకం ఎస్ కే కాసింబి, ఎస్.కె రాజి,s. కృష్ణ, ఎస్ కే దుర్గా బి, రాణి, కే నాగరత్నం, ఎస్ శేఖర్, మౌలాలి, కే నాగేశ్వరమ్మ, జాన్వి, సైదాబీ, మస్తాన్వలి, ఎస్కే అబ్దుల్లా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
