మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/05/2025 బుధవారం).తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా ఖమ్మం బార్ అసోసియేషన్ కు చెందిన ఆవుల అనురాధ నియమితులయ్యారు.
ఈ మేరకు లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ చేతుల మీదుగా నియామకపు ఉత్తర్వులు అనురాధకు అందుకున్నారు. ఇటీవల జరిగిన న్యాయవాద సొసైటీ ఎన్నికల్లో డైరెక్టర్ పదవికి పోటీ చేసిన అనురాధ ఘన విజయం సాధించారు. సోమవారం బీసీ సంక్షేమ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ గా విజయం సాధించినందుకు అనురాధను తన క్యాంప్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
తన నియామకానికి సహకరించిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు దుర్గ ప్రసాద్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సింగం జనార్ధన్ కు, అనురాధ కృతజ్ఞతలు తెలియజేశారు.
