మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08/05/2025 గురువారం)ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సందర్శించిన వైద్య – ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ ను తెలంగాణ వైద్య, ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం ఐఎన్టియుసి నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందించారు .
వైద్య , ఆరోగ్య శాఖలో 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థలోని థర్డ్ పార్టీ ఏజన్సీలను రద్దుచేయాలని, కాంగ్రెస్ ప్రజాపాలనలో చెప్పిన మాట ప్రకారం కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి మొదటి తారీఖున జీతాలు చెల్లించి వారి కుటుంబాలకు జీవిత భీమా , ఆరోగ్య భీమా వంటి కనీస రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలని , రెగ్యులర్ ఉద్యోగానికి రాతపరీక్ష కంప్లీట్ చేసిన స్టాఫ్ నర్స్ , ఎంపీహెచ్ (ఎఫ్). ఫార్మసిస్ట్ , ల్యాబ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాలకి వెంటనే మెరిట్ లిస్ట్ విడుదల చేసి పోస్టింగులు ఇప్పించగలరని కోరారు.
నిర్మల్ జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ మరణించిన వి. భరత్ కుమార్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని , వైద్య ఆరోగ్య శాఖలో అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా కార్యకర్తలకి 20 వేలు నికర వేతనం ఇప్పించి ప్రభుత్వ ఖర్చుతో లైఫ్ ఇన్సూరెన్స్ మరియు వారి కుటుంబాలకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రెసిడెంట్ వి.కృష్ణ రావు , సెక్రటరీ ఎన్.సందీప్ , వర్కింగ్ ప్రెసిడెంట్ వై.సురేష్ , ట్రెజరర్ కె.శివ , సభ్యులు రామకృష్ణ , మోబిన్ , కవిత , వీరన్న , పాషా , నికత్ తదితరులు పాల్గొన్నారు.
