మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 17/05/2025 శనివారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వియం బంజర్ లో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో 21వ తేదీ బుధవారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నారు. 22వ తేదీ గురువారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
20వ తేదీ మంగళవారం మూల విరాట్ కు అభయాంజనేయ స్వామి అభిషేకాల అలంకరణ దర్శనం, గణపతి పూజ, పుణ్యఆవాచనం పంచాంగవప్రాశ్న, రక్షాబంధన దేవత మండపారాధనలు జలధివాసం క్షీరాధివాసం ధ్యాన దివాసం పుష్పత్తివాసం సేయాధివాసం దేవత హోమములు అనంతరం తీర్థప్రసాద వితరణ.
21వ తేదీ బుధవారం మండప పూజలు గర్తన్యాసం, భీజన్యాసం, దాతున్యాసం, విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, దేవతా హోమాలు, పూర్ణాహుతి, దేనుదర్శనం బలిహరణ, వేద ఆశీర్వచనం.
22వ తేదీ గురువారం స్వామి జన్మదిన వేడుకలు సుప్రభాత సేవ, మంగళ తోరణం, విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, హనుమత్ రక్ష కంకణం, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, నాగవల్లి దళార్చన, సహస్రనామార్చనలు, మహా నివేదన, మంత్రపుష్పతీర్థ ప్రసాద వితరణ, మహా అన్నదాన కార్యక్రమం. మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులందరూ తండోపతండాలుగా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.