పెనుబల్లిలో కాసాని ఐలయ్య విప్లవ జోహార్లుమన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 26/01/2025 ఆదివారం). సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఐలయ్య ఆకస్మిక మృతికి శనివారం పెనుబల్లి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.

వి ఎం బంజర లోని చలమాల సూర్యనారాయణ భవన్లో ఐలయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో ఐలయ్య చిత్రపటానికి పూలమాలవేసి సిపిఎం సీనియర్ నాయకులు మామిళ్ళ వెంకటేశ్వరరావు నివాళులర్పిస్తూ గ్రామీణ ప్రాంతం నుండి వ్యవసాయ కూలీలు రైతుల సమస్యల కోసం పోరాడుతూ సిపిఎం పార్టీ కార్యకర్తగా రాష్ట్ర కమిటీ సభ్యునిగా పార్టీ అభివృద్ధికి జీవితాంతం కృషి చేశారని అన్నారు.
సుజాతనగర్ గ్రామపంచాయతీలో ఏడుసార్లు సిపిఎం పార్టీ సర్పంచ్ గా గెలిపించుకున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ జిల్లా కార్యదర్శిగా పేద ప్రజలు వ్యవసాయ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు గొర్రెల మేకల పెంపకం దారుల సమస్యల మీద మిలిటెంట్ పోరాటం నిర్వహించిన పోరాట యోధుడు కామ్రేడ్ కాసాని ఐలయ్యని మామిళ్ళ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కండే సత్యం తడికమళ్ళ చిరంజీవి చలమాల నరసింహారావు నల్లమల ప్రతాప్ చిలక రామచంద్రుడు కొప్పుల వెంకటేశ్వరరావు జువ్వ వెంకటేశ్వర్లు నాగ బాలకృష్ణ పాల్గొన్నారు.
