మన టివి6 న్యూస్ – సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 30/25). ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ పట్టణంలో మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు అమ్మలా గోరుముద్దలు పెట్టారు.
సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దయానంద్ దంపతులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని, నిత్యావసర సరుకులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు భోజనం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులను అమ్మలా ఆదరించి గోరుముద్దలు పెట్టారు. పాఠశాలలో విద్యా విధానాన్ని, హాస్టల్లోనే మౌలిక సదుపాయాల గురించి చిన్నారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర రాష్ట్ర మంత్రివర్యులు అందరూ కలిసి చర్చించి డైట్ చార్జీలు పెంచటం వలన విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యా, హాస్టల్ వసతి అందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దంపతులు తెలియజేశారు.
👉 సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని గురుకుల పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు ఎస్సి, ఎస్టి, బిసి హాస్టల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. కాంట్రాక్టర్ లు విద్యార్థులకు భోజన ఏర్పాట్ల విషయం లో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సొసైటీ చైర్మన్ చల్లగుల్ల కృష్ణయ్య, సీనియర్ నాయకులు కమల్ పాషా, మాజీ కౌన్సిలర్ గ్రాండ్ మౌలాలి, మాజీ కౌన్సిలర్స్ దూదిపాల రాంబాబు, మందపాటి పద్మజ్యోతి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు కుమారి, సత్తుపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
