మన టివి6 న్యూస్ – సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 30/25). జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గాయం తిరుపతిరావు కార్మికులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
స్థానిక చలమల సూర్యనారాయణ భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం గాయం తిరుపతిరావు అధ్యక్షతనసోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతిరావు మాట్లాడుతూకార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, నెలకు కనీస పెన్షన్ రూ 9000 ఇవ్వాలని, కార్మిక వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, పెరుగుతున్న అధిక ధరలను నియంత్రించాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ఆపివేయాలని, విద్యా, వైద్యం ఫ్రీగా అందించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, కేంద్ర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అటవీ హక్కుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని తదితర 18 రకాల డిమాండ్ల సాధనకు ఈ సమ్మె నిర్వహించబోతున్నామని తిరుపతిరావు తెలియజేశారు.
ఈ సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు శక్తివంచన లేకుండా సహకరించాలని, ఈ సమ్మె గ్రామీణ సమ్మెగా పిలుపునిస్తున్నట్లుగా అభివర్ణించారు. అన్ని గ్రామాల్లో సమ్మె విజయవంతం కావాలని, ప్రతి కార్మికుడు కార్మికురాలు ఈ సమ్మె జయప్రదంలో కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిమట విశ్వనాథ మాట్లాడుతూ పెనుబల్లి మండలంలో ఫారెస్ట్ అధికారులు పోడు రైతులపై చేస్తున్న వేధింపులు, దాడులు ఆపాలని అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఎన్నో సంవత్సరాలుగా పోడు సాగు చేసుకుంటా ఉంటే పోడు దున్నుకోకుండా అడ్డుకుంటున్నారని, పోడు సాగు దారులు అండగా ఎప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం ఉంటుంది అని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు రాజినేని మంగమ్మమండల కమిటీ సభ్యులు జొన్నలగడ్డ రమణయ్య గొల్లమందల సరసమ్మ చిలక రామచంద్రు పోతిని బుచ్చాలు గుడిమెట్ల బాబు చిల్లి ముంత సీతారాములు కుంజా రాములు తదితరులు పాల్గొన్నారు















