మన టివి 6న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 30/01/2025 గురువారం). మాజీ ఎంపీటీసీ కోటగిరి సుధాకర్ బాబు జన్మదిన వేడుకలను అభిమానులు 29వ తేదీ బుధవారం రాత్రి 7 గంటలకు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పెనుబల్లి మండల కేంద్రంలోని సుధాకర్ బాబు అభిమానులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుధాకర్ బాబు జన్మదిన సందర్భంగా ఆనందోత్సవాలతో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి టపాసులు కాల్చారు. పెనుబల్లి సీనియర్ నాయకులు వెలువల పుల్లయ్య, చీపి వెంకటేశ్వర్లు, జిల్లెల్ల వెంకటేశ్వరరావు, బొర్రా వెంకటేశ్వర్లు, బండి వెంకటేశ్వర్లు, కాటిని వెంకటేశ్వర్ల, మల్లెల సతీష్, కొప్పుల రాంబాబు, బజ్జురు గోపి, వేణుపాల్, చీప్ శ్రీను, కొండ అంజి తదితరులు సుధాకర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒకరు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సూచనల మేరకు, బిఆర్ఎస్ పార్టీ గైడ్లైన్స్ ప్రకారం సంయమనం పాటిస్తూ కష్టపడి పనిచేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సుధాకర్ బాబు అభిమానులను, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కోరారు.
