మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/03/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కిష్టరం గ్రామపంచాయతీ అంబేద్కర్ నగర్ ఎదురుగా ఉన్నటువంటి సింగరేణి సైలో బంకర్ను తొలగించాలని గత 26 రోజులుగా అంబేద్కర్ కాలనీ వాసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఈ సైలో బంకర్ కారణంగా వచ్చే బొగ్గు కాలుష్యంతో అంబేద్కర్ నగర్ వాసులు అనేక రకాల వ్యాధులతో గతంలో మరణించారని, 7వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున పిల్లి లక్ష్మణరావు కూడా సైజులో బంకర్ కాలుష్యం కారణంగానే మరణించడని అతని పార్థివ దేహాన్ని రోడ్డుపై పెట్టి శుక్రవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు అంబేద్కర్ నగరవాసులు జాతీయ రహదారిని దిబ్బంధం చేస్తూ ఆందోళన చేపట్టారు.
వారం రోజుల్లో సింగరేణి యాజమన్యంతో మాట్లాడి అంబేద్కర్ నగర్ వాసుల సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అంబేద్కర్ వాసులు ఆందోళన నిర్మించారు.