ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీల రభస గత ఏడాది జనవరి నెలలోనే ఈ ఫ్లెక్సీల గొడవ జరగటం గమనార్హం. అప్పుడు విఎం బంజర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని నాయకులే ఎత్తుకెళ్లారని వారిని కాంగ్రెస్ పెద్దలు మందలించారని అప్పట్లో ప్రజల్లో పుకార్లు వ్యాపించాయి.
ఇది ఇల ఉండగా ఈ సంవత్సరం కూడా జనవరి 4వ తేదీ రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో నూతన సంవత్సరం శుభాకాంక్షలు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు ఎమ్మెల్యే రాగమయి దయనంద్ దంపతులు మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఫ్లెక్సీలను ఎవరో కావాలనే ధ్వంసం చేశారని విఎం బంజర పోలీస్ స్టేషన్లో కొందరు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. గత సంవత్సరంలో లాగే ఈ సంవత్సరం కూడా జనవరి నెలలో ఫ్లెక్సీల సమస్యలు తలెత్తడం ఈ ఫ్లెక్సీలు ఎవరు తీస్తున్నారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది.అయితే కొందరు చిల్లర నాయకులు భవిష్యత్తులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ఇనుప ఫ్రేములు ఉపయోగపడతాయని అందుకే అర్ధరాత్రి ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేసి ఉంటారని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తుండగా మరికొందరు మాత్రం ప్రశాంతంగా ఉన్న పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు సృష్టించడానికి ఇటువంటి చిల్లర పనులకు పాల్పడుతున్నారని అనుకుంటున్నారు. మండలంలో ఒకరిద్దరి నాయకులను నియోజకవర్గ కాంగ్రెస్ పెద్దలు ఎన్నిసార్లు మందలించిన వారి వంకర బుద్ధి విధానాలు మార్చుకోకపోవడం వలన ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు.ఏది ఏమైనా స్థానిక ఎన్నికల ముందు ఇలాంటి చిల్లర పనులకు పాల్పడేవారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ మండల నాయకులు అనుకుంటున్నారు.
