మన టివి6 న్యూస్ – ఖమ్మం రూరల్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/06/1025 శనివారం). ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తల్లంపాడు గ్రామంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని హైదరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో తల్లంపాడు కాంగ్రెస్ నాయకులు కలిసి మెమోరాండం ఇచ్చారు. మెమోరాండం అందుకున్న మంత్రి పొంగలిటి సాధ్యమైనంత త్వరగా మీ గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమ్మరి అంబేద్కర్, సోమనబోయిన సత్యనారాయణ, గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు సోమనబోయిన లింగయ్య, బారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Source:mana tv6 news
Tags:కాంగ్రెస్ పార్టీ