వైరల్ ఫీవర్ తో వ్యక్తి మృతి….. సానుభూతి తెలిపిన గ్రామ పెద్దలు.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/03/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎడ్ల బంజర గ్రామంలో వైరల్ ఫీవర్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన 10వ తేదీ సోమవారం చోటుచేసుకుంది.
పెనుబల్లి మండలం యడ్ల బంజర్ గ్రామానికి చెందిన బన్నే శ్రీనివాసరావు (35) రెండు రోజులుగా జ్వరం తో బాధపడుతున్నాడు. ఆదివారం జ్వరం ఎక్కువ అవ్వడంతో ఖమ్మం లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారు జామున చికిత్స పొందుతు మృతి చెందాడు.
మృతుడుకి భార్య ఇద్దరు కుమార్తెలు ఉండగా వ్యవసాయం జీవనదారంగా బతుకుతున్న కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబానికి ఆధారం లేకుండాపోయిందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. శ్రీనివాసరావు మృతి పట్ల గ్రామ పెద్దలు ఎడ్ల సుబ్బారావు, టి వి రామారావు, జంప వేణు బాబు, గోపిషెట్టి సుబ్బారావులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
