🔻 బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వకపోవడంమే ఈ గందరగోళానికి ప్రధాన కారణం.
🔻 ఇది ఫైనల్ లిస్ట్ కాదు…. ఎవరు తొందరపడొద్దు.
🔻 అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలు అందుతాయి.
🔻గ్రామసభల్లో రసాభాస కు కారణం బిఆర్ఎస్ పార్టీనే.
🔻 గత ప్రభుత్వం రేషన్ కార్డులు, పక్కా గృహాలు ఇవ్వకపోవడం దురదృష్టం…… డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 22/01/2025-బుధవారం). సత్తుపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో జరిగిన గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. అర్హులైన కొందరు లబ్ధిదారులు తమకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామ సభల్లో కొన్నిచోట్ల అధికారులపై అసహనం వ్యక్తపరిచారిచిన ప్రజలు. దీనికి స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ లబ్ధిదారులందరూ సంయమనం పాటించాలని, గ్రామ సభలో అధికారులు వెల్లడించినటువంటి లబ్ధిదారుల పేర్లు ఫైనల్ కాదని, వారి ఇళ్ల వద్దకు వచ్చి మళ్ళి అధికారులు పరిశీలిస్తారని, అనర్హులైన వారిని గుర్తించి వారి పేర్లు తొలగిస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. అప్పటివరకు లబ్ధిదారులు సంయమనం పాటించాలని ఆగ్రహం వ్యక్తపరచోద్దని అన్నారు. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు పక్కా గృహాలు రాకపోవడంతో ప్రజలు ఆవేశంతో ఉన్నారని, గత ప్రభుత్వ కాలంలో కొంతమేరకైనా ఇళ్లను రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. ఒక్కసారిగా అదరికీ అన్ని పథకాలు వెంటనే అందించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని విడతలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అందుతాయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద విజయకుమార్ ప్రజలకు హామీ ఇచ్చారు.
