🔻ఎన్నిసార్లు పట్టుకున్న, ఎన్ని కేసులైనా ఆగని రేషన్ బియ్యం దందా…..
🔻 ఆంధ్రాలోని జయంతి కేంద్రంగా కొనసాగిస్తున్న అక్రమ వ్యాపారం ….
🔻గత కొన్ని సంవత్సరాలుగా యదేచ్చగా అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం….
🔻 అక్రమ వ్యాపారం జరిగేది కొండంత…… దొరికేది గోరంత….
మన టివి 6 న్యూస్ (క్రైమ్ న్యూస్ మనకోసం 16/02/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో 15వ తేదీ శనివారం తెల్లవారుజామున మళ్లీ పట్టుబడిన 5 టన్నుల రేషన్ బియ్యం. విఎం బంజర్ ఎస్సై తన సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి ఐదు టన్నుల రేషన్ బియ్యాన్ని, ఆ బియ్యం తరలించేందుకు ఉపయోగిస్తున్న రెండు స్వరాజ్ ఎస్ఎంఎల్ వాహనాలను పట్టుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సివిల్ సప్లై అధికారులైనటువంటి డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ తెలియజేసిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కుప్పెనకుంట్ల, టేకులపల్లి లింక్ రోడ్లో రేషన్ బియ్యం లోడ్ చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించగా AP39 TY 1851, AP39 UH 9514 స్వరాజ్ ఎస్ఎంఎల్ వాహనాలలో సుమారు 114 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని, వాహన డ్రైవర్లు పర్స రవి, ఇనుప నూరి పున్నారావును అదుపులోకి తీసుకొని వి.ఎం బంజర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తమకు సమాచారం అందించారని తెలియజేశారు.
పట్టుబడిన రెండు వాహనాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జయంతి గ్రామానికి చెందిన కె సత్యనారాయణ, కె మల్లిఖార్జునరావు యజమానులుగా ఉన్నట్లు వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం గుర్తించారు. వాహనాల డ్రైవర్లు ఇనపనూరి పున్నారావు, పర్సా రవిలపై 6a కేసులు నమోదు పోలీసులు విచారణ చేపట్టారు.

డ్రైవర్ రవి చెప్పే వివరాల ప్రకారం రామారావు అనే వ్యక్తి తనకు ముత్తగూడెం సమీపంలోని ఓ మామిడి తోట వద్ద రేషన్ బియ్యం ఉన్నాయని వాటిని వాహనంలో లోడు చేయించుకోమని ఫోన్ చేసి చెప్పడంతో, అతని మాట ప్రకారం అక్కడికి వెళ్లి బియ్యాన్ని వాహనంలో లోడు చేసుకుని టేకులపల్లి కుప్పెనగుంట గ్రామాల మధ్య బియ్యం బస్తాలను ఒక వాహనం నుండి మరో వాహనాలకు మారుస్తూ ఉండగా పోలీసులు వచ్చి పట్టుకొని స్టేషన్కు తీసుకుని వచ్చారని వివరించాడు.
