మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/03/2025 బుధవారం).2024 – 25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. పెనుబల్లి మండలంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
పెనుబల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, టేకులపల్లి మోడల్ స్కూల్ లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.
విద్యార్థులు ముందుగానే హాల్ టికెట్లు తీసుకొని పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలనిఎటువంటి ఉద్వేగాలకు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని మండల పరిధిలోని ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రధాన అధ్యాపకులు విద్యార్థులకు తెలియజేశారు.
