google-site-verification: google78487d974c7b676c.html
Daily News

టూరిజంతోనే ఏ దేశమైనా అభివృద్ధిలోకి వస్తుంది…. మంత్రి తుమ్మల నాగేశ్వరావు.

11.4KViews

మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం, (మన ప్రాంత వార్తలు మనకోసం 31/05/2025 శనివారం) ఏ దేశమేనా అభివృద్ధి పరిశ్రమలు వ్యవసాయం ద్వారానే కాకుండా టూరిజం ద్వారా కూడా అభివృద్ధి చెందుతుందని, మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్ట్ పచ్చని ప్రాంతాలను ఎకో టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, జిల్లా కలెక్టర్ ముజ్ముల్ ఖాన్, టూరిజం అధికారులు, జిల్లా అటవీ శాఖ అధికారితో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అనతకాలంలోనే పులిగుండాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఎకో టూరిజం స్పాట్ గా అభివృద్ధి చెందుతుందని దీనికి మనందరి సహాయ సహకారాలు ఉండాలని కోరారు. సత్తుపల్లి నియోజకవర్గం లో పులిగుండాల అటవీ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సహకారం తో రాష్ట్రo లోనే ఒక గొప్ప టూరిజం ప్రాంతం గా తీర్చు దిద్దుతాము అని తెలిపారు. ప్రస్తుతం సుమారు 4.5 కోట్ల రూపాయలు తో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం అందించాబోతుంది అని తెలిపారు.. పర్యాటకులు 2,3 రోజులు ఇక్కడే వుండే విధంగా రూమ్స్, హోటల్స్, ఆహ్లాద కరమైన ఏర్పాట్లు, బోటింగ్ ఏర్పాట్లు చెయ్యనున్ననట్లు తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ…. మనకి దగ్గరలోనే ఎంతో ఆహ్లాదకరమైన టూరిజం స్పాట్ గా ఈ పులిగుండాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఏకోటిరిజం ప్రాంతం అభివృద్ధి చెందటం చాలా సంతోషంగా ఉందని దీనికి జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ అధికారులు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. వారు కూడా మంత్రి కొండా సురేఖ, మంత్రి జూపల్లి కృష్ణారావుకు తో మాట్లాడి దీనికి కావలసిన నిధులను అంచనా వేసి ఇచ్చామని, నిధులు కూడా మంజూరు అయ్యాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరావు, సత్తుపల్లి నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్, అటవీ శాఖ అధికారులు, తుమ్మల అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!