మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూన్ 24/25). నూతనoగా బాధ్యతలు స్వీకరించిన 108,102 సేవల ఖమ్మం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ శుక్రవారం పెనుబల్లి సి హెచ్ సి వైద్యశాలను సందర్శించి 108, 102, నూతనంగా ఆవిష్కరించబడిన నియోనేటల్ అంబులెన్స్ సేవలు, దానిలో ఉన్న పరికరాలు , మానిటర్, వెంటిలేటర్, సిరింజ్ పంపు, ఇంకుబేటర్ గురించి హాస్పటల్ సిబ్బందికి అవగాహన కల్పించారు.
ప్రసవానంతరం నవజాత శిశువుల్లో వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను నివారించుటకు నవజాత శిశు సంరక్షణ కేంద్రం అంబులెన్స్ ని (108) ,(8341800799) ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా అన్ని ప్రాథమిక కేంద్రాలలో, సి.హెచ్.సిల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మానేజర్ దుర్గా ప్రసాద్, సూపరిండెంట్ డా. కిరణ్ కుమార్, ఆర్ఎమ్ఒ డా.స్రవంతి, హె డ్ నర్సు సుధారాణి, నియోనాటల్ సిబ్బంది శ్రీనివాస్, సీతారాం, రమేష్, సైదా ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
